Current Affairs Telugu Daily

పృథ్వీషాకు 8 నెలల నిషేధం  విధించిన  బీసీసీఐ
* పృథ్వీషా గత ఏడాది వెస్టిండీస్‌తో భారత్‌ టెస్టు సిరీస్‌ సిరీస్‌ సందర్భంగా మార్మోగిన పేరు. 
* 18 ఏళ్లకే భారత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకుని, తన తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు శతకంతో భారత క్రికెట్‌ భవిష్యత్‌ తారగా కితాబందుకున్న ఈ ముంబయి కుర్రాడు.. ఇప్పుడు ఓ ప్రతికూల విషయంతో వార్తల్లో వ్యక్తిగా మారాడు. 
* డోపీగా తేలిన పృథ్వీపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. ఎనిమిది నెలల పాటు ఏ రకమైన క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించింది.
*  ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో పృథ్వీ విఫలమయ్యాడు.
*  అతడి మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్‌ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది.
*  ఇది సాధారణంగా దగ్గు మందుల్లో ఉంటుందని పేర్కొన్న బీసీసీఐ  అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం మ్యాచ్‌లు ఆడేటపుడు లేదా బయట దీని వాడకం నిషిద్ధమని తెలిపింది. 
* జులై 16నే పరీక్ష ఫలితాలు వెల్లడి కాగా.. వెంటనే బీసీసీఐ పృథ్వీకి నోటీసులు జారీ చేసింది.
*  దగ్గు మందు వినియోగం వల్లే నిషేధిత ఉత్ప్రేరకం తన ఒంట్లోకి వచ్చిందని పృథ్వీ ఇచ్చిన వివరణతో బోర్డు సంతృప్తి చెందినట్లు సమాచారం.
*  అందుకే మార్చి 16 నుంచే అమల్లోకి వచ్చేలా పృథ్వీపై నిషేధం విధించింది. దీంతో నవంబరు 15కే పృథ్వీకి శిక్ష పూర్తి కానుంది.
*  షాతో పాటు అక్షయ్‌ దివాల్కర్‌, దివ్య గజ్‌రాజ్‌ అనే ఇద్దరు దేశవాళీ క్రికెటర్లూ డోపీలుగా తేలి నిషేధానికి గురయ్యారు.
*  ప్రస్తుతం టెస్టులో టీమ్‌ఇండియాకు తొలి ప్రాధామ్య ఓపెనర్లలో పృథ్వీ ఒకడు. గాయం కారణంగా రాబోయే వెస్టిండీస్‌తో సిరీస్‌కు అతడు ఎంపిక కాలేదు.
*  నిషేధం నేపథ్యంలో ఆ తర్వాత బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌లకూ పృథ్వీ దూరం కానున్నాడు. 
* నిరుడు వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు టీమ్‌ఇండియా ఓపెనర్‌గా తొలి అవకాశం దక్కించుకున్న పృథ్వీ ఒక శతకం సహా 237 పరుగులతో అదరగొట్టాడు. 
* ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు గెలిచాడు. 
* ఆస్ట్రేలియా పర్యటనకూ ఎంపికైన పృథ్వీ.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాదానికి గాయం కావడంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత భారత్‌ టెస్టులే ఆడలేదు. 
* గాయం నుంచి కోలుకుని ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబయికి ప్రాతినిధ్యం వహించిన అతను.. ఆపై దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌ కూడా ఆడాడు. 
* ఇటీవలే తుంటి గాయానికి గురైన పృథ్వీ.. వెస్టిండీస్‌-ఎతో భారత్‌-ఎ వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. 
* అతను ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉంటూ ఫిజియోల సాయంతో గాయం నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

views: 721

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams