Current Affairs Telugu Daily

టైగర్ సెన్సస్ రిపోర్ట్ 2018 ను పీఎం మోడీ విడుదల 
*  మన జాతీయ జంతువైన పులికి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఆవాసంగా భారత్‌ మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
*  ఈ రోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్ 2018 నివేదికను మోదీ విడుదల చేశారు.
*  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పులుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 
*‘2014లో దేశంలో 2,226 పులులు ఉండేవి. 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు చేరింది. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని 9ఏళ్ల క్రితం లక్ష్యంగా పెట్టుకున్నాం.  మరో నాలుగేళ్లు ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం.
*  ఈ నివేదిక ప్రతి భారతీయుడికి, ప్రతి ప్రకృతి ప్రేమికుడికి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ ఐదేళ్లలో పులల సంరక్షణ కేంద్రాలు 692 నుంచి 860కి పెరిగాయి. కమ్యూనిటీ రిజర్వ్‌లు 43 నుంచి 100కి పైగా పెరిగాయి.
*  ప్రపంచంలోనే పులులకు అత్యంత సురక్షితమైన ఆవాసంగా భారత్‌ మారింది’ అని మోదీ తెలిపారు. 
* బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమా పేర్లను ప్రస్తావిస్తూ ‘‘ఏక్తా టైగర్‌’తో కథ ప్రారంభమై ‘టైగర్‌ జిందా హై’కి చేరింది. అయితే ఇక్కడితో ఆగిపోదు’ అని మోదీ చెప్పుకొచ్చారు.
*  ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ పేరుతో ప్రతి నాలుగేళ్లకోసారి పులుల సంఖ్యపై ప్రభుత్వం నివేదిక విడుదల చేస్తోంది.
*  2006లో దీన్ని ప్రారంభించగా.. 2010, 2014లో నివేదిక విడుదల చేసింది.  

views: 905

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams