Current Affairs Telugu Daily

బిర్లా ఆర్కియాలాజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కు  గోల్డెన్ జూబ్లీ 
 * బిర్లా సైన్స్ కేంద్రాలు విజ్ఞాన భాండాగారాలని, యువతకు, విద్యార్థులకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు.
*  హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో  బిర్లా ఆర్కియాలాజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బాక్రీ) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దేశంలోనే మొట్టమొదటి బిర్లాస్పేస్ మ్యూజియాన్ని ప్రారంభించారు.
* ఇది  నుంచే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. మ్యూజియంను ఇక్కడ ఏర్పాటుచేసేందుకు పూనుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
*  నాలెడ్జ్ సిటీగా పేరుపొందిన హైదరాబాద్‌కు బిర్లా సైన్స్ కేంద్రం తలమానికమని పేర్కొన్నారు.
*  ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. 
* సీకే బిర్లా గ్రూప్ చైర్మన్ సీకే బిర్లా మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని తన తల్లిదండ్రులు నిర్మలా బిర్లా, గంగాప్రసాద్ (జీపీ) బిర్లా ఎంతో ఆరాధించేవారని, అందుకే హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా అనేక వైజ్ఞానిక పరిశోధనా కేంద్రాలను, విద్యాసంస్థలను, ఆలయాలను నెలకొల్పారని తెలిపారు.
*  ప్రజాసేవలో బాక్రీ యాభై వసంతాలను పూర్తిచేసుకొని స్వర్ణోత్సవాలను జరుపుకోవడం సంతోషదాయకమన్నారు.
*  బాక్రీ చైర్మన్ కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాక్రీ చైర్ పర్సన్ నిర్మలా బిర్లా, సీకే బిర్లా గ్రూప్ కో-చైర్‌పర్సన్ అమితా బిర్లా, బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బీజీ సిద్ధార్థ్, పుణె దక్కన్ కాలేజ్ చాన్స్‌లర్ డాక్టర్ ఏపీ జమ్‌ఖేద్కర్ పాల్గొన్నారు. 
* ఇస్రో సాధించిన విజయాలతోపాటు జీఎస్‌ఎల్వీ ఎమ్కే-3, రోహిణి, యాపిల్, చంద్రయాన్ -1, మంగళ్‌యాన్ లాంటి ఉపగ్రహాల నమూనాలను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
*  శాస్త్రసాంకేతిక విజ్ఞానం, కళలు, నిర్మాణశైలి, సంస్కృతి, సంప్రదాయాల గురించి భావితరాలకు తెలియజేసేందుకు బిర్లా పురావస్తు, సాంస్కృతిక పరిశోధన సంస్థ ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది.
* బిర్లా పురావస్తు మరియు సాంస్కృతిక పరిశోధన సంస్థ, హైదరాబాద్. పురావస్తు శాస్త్రం, సంగీత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం మరియు సమాచార సాంకేతిక రంగాలలో పరిశోధన కోసం బిర్లా పురావస్తు మరియు సాంస్కృతిక పరిశోధనా సంస్థ 1969 లో స్థాపించబడింది.

views: 739

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams