Current Affairs Telugu Daily

టెస్టులకు గుడ్‌బై  చెప్పిన మహమ్మద్‌ ఆమీర్‌ 
* పాకిస్థాన్‌ పేసర్‌ మహమ్మద్‌ ఆమీర్‌ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాడని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది.
*  టెస్టులకు దూరమైనా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతను అందుబాటులో ఉంటాడని తెలిపింది. 
* 2009లో తొలి టెస్టు ఆడిన ఆమీర్.. 36 మ్యాచులు ఆడి 119 వికెట్లు పడగొట్టాడు. 
* 2010లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన అతను ఐదేళ్ల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. 
* 2015లో తిరిగి దేశవాళి క్రికెట్‌లో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. 
*  ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో 17 వికెట్లతో పాక్‌ తరఫున అగ్రస్థానంలో నిలిచాడు.
*  స్పీడ్‌స్టర్‌ ఆమీర్‌ బౌలింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
*  భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఆమీర్‌ బౌలింగ్‌ను ఎంతో ఇష్టపడతానని ఒక సందర్భంలో అన్నాడు. 
* అంతేకాకుండా ఆమీర్‌కు తన బ్యాట్‌ను కోహ్లీ బహుమతిగా ఇచ్చాడు.
* ‘సంప్రదాయ టెస్టులకు పాకిస్థాన్ తరఫున ప్రాతినిథ్యం వహించినందుకు ఎంతో గౌరవంగా ఉంది.
*  టెస్టుల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. వైట్‌బాల్‌ క్రికెట్‌కు అందుబాటులో ఉంటాను.
*  వచ్చే ఏడాదిలో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. 
* పాక్‌ యువ పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వారికి అవకాశాలు ఇచ్చేలా ప్రణాళికలు చేయాలి.
*  పీసీబీ, జట్టు సభ్యులు, ప్రత్యర్థులకు ధన్యవాదాలు. మీతో కలిసి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రయాణిస్తాను.’ అని ఆమీర్‌ పేర్కొన్నాడు.

views: 636

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams