Current Affairs Telugu Daily

తాజా ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం 103 
* అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా)  విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టు రెండు ర్యాంక్‌లు చేజార్చుకుని 103వ ర్యాంక్‌కు చేరుకుంది.
*  ఈ నెల మొదట్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం బ్లూ టైగర్స్ ర్యాంకింగ్స్‌ను దెబ్బతీసింది.
*  గత నెలలో విడుదలైప ర్యాంక్‌లతో పోలిస్తే ప్రస్తుతం ఐదు పాయింట్లు చేజార్చుకుని 1214తో కొనసాగుతున్నది.
*  ఓవరాల్‌గా బెల్జియం, బ్రె జిల్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఉరు గ్వే వరుసగా టాప్‌లో ఉన్నాయి.
* అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) అంతర్జాతీయ పాలకమండలి. దీని ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంది.
*  అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) ప్రస్తుత అధ్యక్షుడు: జియాని ఇన్ఫాంటినో. ఫీఫా సంస్థ అతిపెద్ద అంతర్జాతీయ ఆటలపోటీల యెుక్క నిర్వహణకు ముఖ్యంగా 1930 నాటినుండి ఫీఫా ప్రపంచ కప్కు బాధ్యత వహిస్తోంది.
*   అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) సమాఖ్యలో 208 సభ్యసంస్థలు ఉన్నాయి
*  అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా)  సమాఖ్య పారిస్‌లో 21 మే 1904న స్థాపించబడింది; స్వతహాగా ఫ్రెంచ్ భాషలో పెట్టిన అసలు పేరు ఈనాటికీ అలాగే వ్యవహారంలో ఉంది.
*  స్థాపక సభ్యులలో బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్సు, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్ మరియు స్విట్జర్ల్యాండ్ యొక్క జాతీయ సంఘాలు ఉన్నాయి. ఇంకనూ, అదే రోజు, జర్మన్ అసోసియేషన్ టెలిగ్రామ్ ద్వారా అనుబంధంగా ఉండే అంగీకారాన్ని ప్రకటించింది.
* ఫీఫా మొదటి అధ్యక్షుడు రాబర్ట్ గురిన్. 

views: 898



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams