Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌
* అమెరికాకు చెందిన పేమెంట్స్ సేవల సంస్థ పేపాల్ ఇండియాలో తన మూడో టెక్నాలజీ సెంటర్‌ను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నెలకొల్పింది.
*  చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు సైబర్ దాడుల బారినపడకుండా నిరోధించడానికి పనిచేయనున్న ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. 
* ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ...దుబాయ్, అమెరికా వంటి దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు తమ కుటుంబాలకు డబ్బు పంపుకోవడానికి పేపాల్ సేవలను ఉపయోగించుకోవచ్చని, సురక్షితంగా డబ్బు పంపేందుకు ఇది అనువుగా ఉంటుందని చెప్పారు. 
* వ్యాపారవేత్తలు కూడా నగదు లావాదేవీలు నిర్వహించడానికి పేపాల్ ఉపయోగపడుతుందన్నారు.
*  పేపాల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తుషార్ షా మాట్లాడుతూ.. బహుళజాతి కంపెనీలకు, స్టార్టప్లకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, ఇక్కడ తగినంత మంది ఐటీ నిపుణులు ఉన్నందున టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఈ నగరాన్ని ఎంచుకున్నామని చెప్పారు.
*  కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీతో ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు సురక్షితంగా జరిగేలా చూస్తున్నామని అన్నారు.
*  టీ-హబ్, టీబ్రిడ్జ్ వంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఐటీ, టెక్నాలజీ కంపెనీలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని ప్రశంసించారు.
*  పేపాల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ గురుభట్ మాట్లాడుతూ.. భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో వంద మంది పనిచేస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందన్నారు. కస్టమర్ల సమాచారాన్ని నిల్వ చేసే డాటా సెంటర్‌ను ఇండియాలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
* 200కి పైగా దేశాల్లో సేవలు అందిస్తున్న పేపాల్‌కు 26 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 
* మనదేశంలో పేపాల్‌కు ఇది వరకే చెన్నై, బెంగళూరులో కార్యాలయాలు ఉన్నాయి.

views: 799

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams