Current Affairs Telugu Daily

బాలిలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు  తెలంగాణ నీటిపాదరులశాఖ
 *  చారిత్రక చెరువులకు పూర్వవైభవం.. ఆన్-ఆఫ్ పద్ధతితో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలోసాగు, అధికదిగుబడి.. టెయిల్ టు హెడ్‌తో చివరి ఆయకట్టుకూ నీటివిడుదల.. సాగునీటి సక్రమ నిర్వహణ కోసం తెలంగాణ నీటిపారుదలశాఖ చేపట్టిన విధానాలు.
*  క్షేత్రస్థాయిలో విజయవంతమైన ఈ మూడు విధానాలను అంతర్జాతీయ యవనికపై మనవాణి విన్పించే అరుదైన అవకాశం తెలంగాణ నీటిపాదరులశాఖకు దక్కింది.
*  ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్, డ్రైనేజీ (ఐసీఐడీ) మూడేండ్లకు ఒకసారి నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ సాధించిన ఈ మూడు విధానాలకు సంబంధించిన సాంకేతికపత్రాలను సమర్పించేందుకు అమోదం లభించింది.
*  ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు వివిధ క్యాటగిరీల్లో సాంకేతికపత్రాలను ఆహ్వానించగా.. గత మార్చిలో తెలంగాణ సాగునీటిశాఖ ఇంజినీర్లు నాలుగింటిని పంపించారు.
*  వాటిని సమగ్రంగా పరిశీలించిన అంతర్జాతీయ పరిశీలన కమిటీ మూడుపత్రాలను ఆమోదించింది.
*  సెప్టెంబర్ మొదటివారంలో జరిగే సదస్సులో ఆ పత్రాలను సమర్పించాలని థర్డ్ వరల్డ్ ఇరిగేషన్ ఫోరం (డబ్ల్యూఐఎఫ్-3) తరపున విజయ్ కే లబ్సెట్వార్ మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు.
*  సదస్సులో సమర్పణకు ఎంపికైన ఈ పత్రాలను ఐసీఐడీ ప్రత్యేక సావనీర్‌లో ప్రచురిస్తారు. 
* సాగునీటిశాఖ ఇంజినీర్లు సమర్పించిన పత్రాలు అంతర్జాతీయ సదస్సులో సమర్పణకు ఎంపికైనందుకుగాను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్‌రావు (ఇరిగేషన్), నాగేందర్‌రావు (పరిపాలన) హర్షం వెలిబుచ్చారు.

views: 714

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams