Current Affairs Telugu Daily

చిన్నారులపై లైంగిక నేరాలపై విచారణకు ప్రత్యేక కోర్టులు
 *  దేశంలో పెరుగుతున్న చిన్నారులపై లైంగిక నేరాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
*  ఈ కేసుల విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
*  పోక్సో చట్టం కింద 100 కేసులు పెండింగ్‌లో ఉన్న ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
*  చిన్నారులపై లైంగిక నేరాల కేసులను విచారించేందుకు 60 రోజుల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు. ఈ కోర్టుల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలని ఆదేశించింది. 
* దీనిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సొలిసిటరీ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది.
*  చిన్నారులపై లైంగిక నేరాలపై పత్రికా కథనాలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారిస్తుంది.

views: 679

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams