Current Affairs Telugu Daily

విశ్వాస పరీక్షలో పరాజయం పాలైన  కుమారస్వామి సర్కారు 
 * కర్ణాటకలో హైటెన్షన్ పొలిటికల్ డ్రామాకు  తెరపడింది. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది.
*  అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సంకీర్ణ సర్కార్ ఓడిపోయింది. మూడు వారాల కిందట కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కన్నడనాట రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే.
*  నాటి నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. క్యాంపు, రిసార్ట్ రాజకీయాలు, అలకలు, బుజ్జగింపులు, బెదిరింపులు ఇలా రోజుకో మలుపు తిరిగింది.
*  ముఖ్యంగా అసెంబ్లీలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశించినా.. రెబల్స్ రాజీనామాలపై తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. రాజకీయంగా బీజేపీ తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఆయన తొణకలేదు.
* అయినా చివరికి ప్రభుత్వం కుప్పకూలక తప్పలేదు. అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక సంకీర్ణ ప్రభుత్వం చతికిలపడింది.
* డివిజన్ పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్‌లో.. కుమారస్వామి సర్కార్ కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును పొందలేకపోయింది. తీర్మానానికి అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 103 కాగా.. ప్రభుత్వం నాలుగు ఓట్ల దూరంలో నిలిచింది.
* దీంతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం విఫలమైంది అని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించారు. ఫలితంగా 14 నెలల కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ పాలన ముగిసింది.
* కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాత్రి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా లేఖను అందించగా.. ఆయన ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామికి సూచించారు. 

views: 696

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams