Current Affairs Telugu Daily

చంద్రయాన్-2 స్ఫూర్తితో బీజాయాన్   
*  దేశవ్యాప్తంగా అడవులు తరిగిపోతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పార్కులనే అడవులుగా మార్చుతున్నారు.
*  ఒకవైపు అటవీసంపదను కాపాడుతూనే పట్టణాల్లో సైతం అడవులను తలపించే వాతావరణాన్ని కల్పించడానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) వినూత్న ప్రయోగం చేస్తున్నది.
*  తన పరిధిలోని అర్బన్‌పార్కులు, రిజర్వు ఫారెస్టుల్లో దట్టమైన అడవులను సృష్టించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
*  తాజాగా చంద్రయాన్-2 స్ఫూర్తితో బీజాయాన్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నది.
*  ఇందుకోసం కల్పతరు అనే స్వచ్ఛందసంస్థ సహకారం తీసుకుంటున్నది. 
* చంద్రయాన్ స్ఫూర్తిగా తాము బీజయాన్ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు కల్పతరు స్వచ్ఛంద సంస్థ ఇటీవలే ప్రకటించింది. 
* ఈ కార్యక్రమంలో డ్రోన్ టెక్నాలజీతో గాలిలోనుంచే విత్తనాలు విస్తృతంగా చల్లుతారు. దీనితో కొన్ని గంటల్లోనే వందల ఎకరాల్లో విత్తనాలను చల్లవచ్చని అధికారులు తెలిపారు.
*  ప్రయోగాత్మకంగా గౌడవెల్లి పోచంపల్లి కలాన్‌లోని 1270 ఎకరాల్లో ఉన్న పార్కుస్థలంలో బీజయాన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీఎస్‌ఎఫ్‌డీసీ ఎండీ, ఐఎఫ్‌ఎస్ అధికారి రఘువీర్ తెలిపారు. 
* శామీర్‌పేట తూంకుంటలోని 1625 ఎకరాల్లో, లాల్‌గడి మలక్‌పేటలోని 1,045 ఎకరాల్లో దట్టమైన అడవులను సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
*  జపాన్‌లో మియావాకి తరహాలో హెక్టారుకు పది వేల మొక్కలను నాటించనున్నట్లు తెలిపారు. తక్కువ స్థలంలోనే అడవులను తలపించే వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
* హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఉన్న కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌లో కొంతప్రాంతంలో అడవిని తలదన్నే వాతావరణాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రాజమండ్రి సమీపంలోని కడియం నుంచి పది, పదిహేను అడుగుల ఎత్తు ఉన్న పెద్దపెద్ద చెట్లను తీసుకొచ్చి నాటుతున్నారు.
*  దాదాపు మూడువేల చెట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. వంద క్యూబిక్ మీటర్ల పరిధిలో గుంతలు తవ్వి, పూర్తి బందోబస్తుతో అందులో మొక్కలను పెడుతున్నారు.
*  అదేస్థలంలో సూర్యరశ్మి కూడా సోకనివిధంగా ఇప్పుడు దట్టమైన అడవిని తయారుచేస్తున్నారు. ఎగుడు దిగుడుగా, ఎత్తువంపులతో ఉన్న ఈ ప్రాంతాన్ని గ్రీన్‌వ్యాలీగా అభివృద్ధిపరుస్తున్నారు.

views: 715

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams