Current Affairs Telugu Daily

కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్  క్లీన్‌స్వీప్‌
*  కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు స్వర్ణాల క్లీన్‌స్వీప్‌ చేశారు. ఏడు విభాగాల్లో బరిలో దిగి అన్నింట్లోనూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.
* తెలంగాణ వర్థమాన క్రీడాకారిణి శ్రీజ మహిళల డబుల్స్‌లో రజతం, మహిళల సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం గెలుచుకుంది.
* పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో హర్మీత్‌ 4-3 (9-11, 6-11, 11-5, 11-8,   17-15, 7-11, 11-9) తేడాతో ఫేవరేట్‌ సతియాన్‌కు షాకిచ్చాడు.
* పురుషుల డబుల్స్‌లో అమల్‌రాజ్‌- మానవ్‌ థక్కర్‌ జోడీ 3-1తో టాప్‌ సీడ్‌ సతియాన్‌- శరత్‌ కమల్‌పై విజయం సాధించింది.
* మహిళల సింగిల్స్‌లో అహిక ముఖర్జీ 11-6, 11-4, 11-9, 19-17తో మధురికపై నెగ్గింది.
* మహిళల డబుల్స్‌లో పూజ- కృత్విక జోడీ 11-9, 11-8, 9-11, 12-10తో శ్రీజ- మౌసుమి ద్వయంపై గెలిచింది.
* కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ మొదటిసారి 1971 లో సింగపూర్‌లో ప్రదర్శించారు; టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2019 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది, ఈ టోర్నమెంట్ ఒడిశా లొ జరిగింది.
*  కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ జూలై 17 బుధవారం నుండి జూలై 22 సోమవారం వరకు జరిగింది .

views: 724

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams