Current Affairs Telugu Daily

 నారాయణమూర్తికి రాయల్ హాలోవే యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ 
 * ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తికి రాయల్‌ హాలోవే యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ బహుకరించింది.
* కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో ఆయన సేవలకు గాను పురస్కారం వరించింది.
* ఇంగ్లాండ్‌ సర్రేలోని ఎగాంలో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో నారాయణ మూర్తికి డాక్టరేట్‌ ప్రదానం చేశారు.
* ఈ సందర్భంగా కంప్యూటర్‌ సైన్స్‌లో అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు మూర్తి పట్టాలు అందించారు. ‘డాక్టరేట్‌ అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. రాయల్‌ హాలోవే యూనివర్సిటీ గుర్తింపునకు కృతజ్ఞతలు.
* కొత్తతరం పట్టభద్రులతో కలిసి పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో మంచి విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను’ అని మూర్తి అన్నారు.
*  అంతర్జాతీయంగా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ను స్థాపించిన వారిలో మూర్తి ఒకరు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

views: 728

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams