గ్రాండ్‌మాస్టర్ లో స్థానం సంపాదించుకున్న ప్రీతూ గుప్తా
* ఢిల్లీకి చెందిన తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో ప్రవేశించిన గుప్తా 15 ఏళ్లకే జీఎం హోదా పొంది ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా నిలిచాడు.
* పోర్చుగీస్ చెస్ టోర్నమెంట్ లీగ్ ఐదో రౌండ్ మ్యాచ్‌లో లెవ్ యంవెలెవిచ్ (జర్మనీ)పై విజయం సాధించడం ద్వారా ప్రీతూ జీఎం ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించాడు.
* దీంతో గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించిన 64వ భారతీయుడిగా ప్రీతూ గుర్తింపు పొందాడు.
* జీఎం హోదాకు కావాల్సిన మూడు నార్మ్‌ల్లో మొదటిది జిబ్రా ల్టర్ మాస్టర్స్‌లో, రెండోది బైయిల్ మాస్టర్స్‌లో గతేడాది సాధించిన గుప్తా.. మూడోది, చివరిదైన నార్మ్‌ను ఈ ఏదాది ఫిబ్రవరిలో పోర్టికో ఓపెన్‌లో అందుకున్నాడు.
* 1987లో విశ్వనాథన్ ఆనంద్ భారత్ తరఫున తొలి గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర లిఖించగా ఆ తర్వాత 32 ఏళ్ల కాలంలో భారత్ నుంచి మరో 63 మంది గ్రాండ్‌మాస్టర్లు తయారయ్యారు.
* ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి కోనేరు హంపి, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు, కార్తీక్ వెంకటరామన్.
* తెలంగాణ నుంచి ఎరిగైసి అర్జున్, హర్ష భరతకోటి ఉన్నారు
views: 761