Current Affairs Telugu Daily

 ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చల్లా మధుసూదన్‌రెడ్డి 
* ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ- ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చైర్మన్‌గా చల్లా మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు.
*ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్  ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* వైయ‌స్ఆర్‌ సీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహించి ప్రతిష్టాత్మకమైన పార్టీ విజయానికి కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి ఎనలేని సేవ చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తూ, సమాజ అభివృద్ధిపై పరిపూర్ణమైన అవగాహన కలిగివున్న వ్యక్తిగా చల్లా మధుసూదన్ రెడ్డిని ఈ పదవిలో నియమించడం జరిగింది. 

views: 704

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams