Current Affairs Telugu Daily

హిమాదాస్‌కు ఐదో స్వర్ణం
* భారత స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ పసిడి పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా స్వర్ణమే లక్ష్యంగా చెలరేగుతున్న హిమ.. మరోమారు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించింది.
* నెల రోజుల వ్యవధిలో ఐదో స్వర్ణంతో మెరిసింది.  జరిగిన మహిళల 400మీటర్ల రేసును ఈ అసోం అథ్లెట్ 52.09 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకుంది.
* తన వ్యక్తిగత ప్రదర్శన (50.79సె) కంటే తక్కువైనా..వరల్డ్ చాంపియన్‌షిప్ అర్హత మార్క్(51.80సె) అందుకోవడంలో హిమా సఫలం కాలేకపోయింది.
* గత ఏప్రిల్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 400మీటర్ల ఈవెంటులో నిరాశపరిచిన తర్వాత ఈ విభాగంలో దాస్‌కు ఇదే తొలి పతకం.
* మరోవైపు పురుషుల 400మీటర్ల హార్డిల్ రేసులో ఎంపీ జబీర్ 49.66 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం సాధించాడు. 200మీటర్ల రేసులో మహ్మద్ అనస్(20.95సె) కాంస్యం అందుకున్నాడు.
* గతం లో  1) పొంజ్‌నన్ అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో,2) కుంటో అథ్లెటిక్స్ మీట్,3) క్లాడ్నో అథ్లెటిక్స్ మీట్ ,4) టాబోర్ అథ్లెటిక్స్ మీట్ ,5) చెక్ రిపబ్లిక్ అథ్లెటిక్స్ మీట్ అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించింది కలవు 

views: 790



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams