Current Affairs Telugu Daily

బ్యాంకు అఫ్ బరోడా 111వ వ్యవస్థాపక దినోత్సవం 
* బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, అదే సమయంలో ఖాతాదారుల లావాదేవీల భద్రతనూ దృష్టిలో పెట్టుకోవాలని పశు సంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.
* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) 111వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  సత్యసాయి నిగమాగమంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
* ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఇటీవలికాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా బ్యాంక్ ఖాతాదారులు సురక్షితమైన లావాదేవీలకు మొగ్గు చూపాలన్నారు.
* సైబర్ నేరాలపై ఖాతాదారులకు అప్రమత్తత కల్పించడంతోపాటు అవగాహన పెంచే కార్యక్రమాలను బ్యాంకులు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
* కాగా, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడాను సుల్తానియా ప్రశంసించారు.
* 1908 జూలై 20న బీవోబీని స్థాపించారు. 
* ఈ మధ్యే ఇందులో విజయా, దేనా బ్యాంక్‌ల విలీనం జరిగినది. 
* కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ జోనల్ హెడ్ పి శ్రీనివాస్, డిప్యూటీ జోనల్ హెడ్ గిడుగు సత్యనారాయణ, రీజినల్ హెడ్ వికె ఉపాధ్యాయ, తెలంగాణ రీజినల్ హెడ్ కె విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

views: 709



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams