Current Affairs Telugu Daily

గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్‌లో వెంకయ్య నాయుడు 
* భారత ఆర్థిక వ్యవస్థ అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, దేశంలో సంస్కరణలు వేగం పుంజుకున్నాయని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
*  హైదరాబాద్‌లో భారత సంతతి వైద్యుల అంతర్జాతీయ ఆరోగ్య సదస్సును ఆయన ప్రారంభించారు.
* అమెరికాలో సేవలందిస్తున్న భారతీయ వైద్యులు తమను కన్న భూమి సేవకూ ముందుకు రావా లని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కర్మభూమి అయిన అమెరికాలో ఉండి అత్యుత్తమ సేవలందిస్తున్నారని వైద్యులను ప్రశంసిస్తూనే.. మాతృభూమి భారత్‌లోని గ్రామాలను దత్తత తీసుకుని సేవలందించడంపై దృష్టిసారించాలని వారికి సూచించారు. 
* అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియిన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’ (ఏఏపీఐ) ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌–2019’ పేరుతో తాజ్‌కృష్ణా హోటల్‌లో  నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
* భారత్‌లో యాంటీ బయోటిక్స్‌ నిరోధక వ్యవస్థ క్షీణించడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు భారత వైద్యులతో కలిసి అమెరికాలోని భారత సంతతి వైద్యులు పనిచేయాలని కోరారు.
* అమెరికాకు వెళ్లి చదువుకోవడం అక్కడ పనిచేయడం తప్పుకాదని.. అలా చేస్తూనే మాతృ భూమికి కొంతైనా రుణం చెల్లించేందుకు ముందుకు రావా లన్నారు. ప్రపంచ వైద్య వ్యవస్థకు భారత్‌ దీపస్తంభమని శుశ్రుతుడు, చరకుడు వంటి వారు నిరూపించారన్నారు. చాలా దేశాల నుంచి భారత్‌కు వైద్యసేవల కోసం వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు.
* గతంతో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం 69 ఏళ్లకు పెరిగిందని, ఇదంతా వైద్యుల కృషి ఫలితమేనన్నారు. సామాజిక వైద్య బాధ్యతలతో ఆరోగ్య భారత్‌ లక్ష్యం సులువుగా సాధించవచ్చని అన్నారు.
*  అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరికి భారత వైద్యులే సేవలందిస్తున్నారని తెలిపారు. ఇదంతా నాణేనికి ఒకవైపేనని ఇంకా చాలాచోట్ల ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు లేవనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. గ్రామాల వరకు వైద్య సేవల విస్తరణకు ఒక్క ప్రభుత్వం పనిచేస్తేనే సరిపోదని, ప్రైవేటురంగం కూడా చొరవ చూపాలని అన్నారు.  
*  అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యూఎస్‌ఏ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. త్వరలో భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడవదిగా ఆవిర్భవిస్తుందని, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌తోపాటు మూడీస్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయని అన్నారు.
*  వైద్యసేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు కేవలం ప్రభు త్వం కృషిచేస్తే సరిపోదన్నారు. విదేశాల్లో ఉన్నా మాతృదేశ ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలను విస్మరించవద్దని సూచించారు.
*  సదస్సు సావనీర్‌తోపాటు భారత పునరుజ్జీవన మండలి రూపొందించిన కాంప్రహెన్సివ్ కార్డి యాక్ లైవ్ సపోర్ట్ మాన్యువల్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
*  సదస్సు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ సీ ప్రతాప్‌రెడ్డి, ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు, నోరి దత్తాత్రేయుడు, పలువురు భారత సంతతి వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

views: 724

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams