Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టు తీర్పులు ఇప్పుడు స్థానిక భాషలలో అందుబాటు
*  సుప్రీంకోర్టు తీర్పులు తెలుగు భాషలోనూ అందుబాటులోకి వచ్చాయి.
*  ఆంగ్లంతోబాటు పలు భారతీయ భాషల్లో తీర్పు ప్రతులను సుప్రీంకోర్టు  తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 
* ఇందులో తెలుగు సహా హిందీ, అస్సామీ, కన్నడ, కశ్మీరీ, మరాఠీ, ఒడియా, తమిళం, బెంగాలీ భాషలకు చెందిన 114 తీర్పు ప్రతులను అందుబాటులో ఉంచింది. 
*  కేసు ఏ ప్రాంతానికి చెందిందో ఆ ప్రాంతానికి చెందిన కక్షిదారులు తీర్పు ప్రతిని చదువుకోవడానికి అనువుగా సదరు భారతీయ భాషలోకి అనువదించారు.
*  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆంగ్ల ప్రతి అదే రోజు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారని, ఇతర భారతీయ భాషల్లో అనువదించి వెబ్‌సైట్‌లో పొందుపరచడానికి కనీసం వారం రోజులు పడుతుందని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగొయి ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.
*  ధ్రువీకరించిన తీర్పు కాపీలు భారతీయ భాషల్లోనూ కక్షిదారులకు అందుబాటులో ఉంచాలని అక్టోబరు, 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు.
*  ప్రజలకు న్యాయం చేయడం ఒక్కటే ముఖ్యం కాదు...తనకు జరిగిన న్యాయాన్ని సొంత భాషలో చదువుకొనే అవకాశాన్నీ కల్పించాలన్న రాష్ట్రపతి సూచనను సుప్రీంకోర్టు అమలు చేసింది.
*  తొలుత పౌర వివాదాలు, నేర సంబంధాలు, యజమాని- అద్దెకు ఉండేవారు, వివాహ సంబంధ సమస్యలకు సంబంధించిన తీర్పు ప్రతులను భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
* ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసిన తీర్పు ప్రతులను విడుదల చేశారు.
*  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలి ప్రతి అందుకున్నారు.
* భారత సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానంగా పరిగణించబడుతుంది, భారతదేశ రాజ్యాంగంలోని అధ్యాయం అరవ భాగం, ఐదవ పరిధిలో ఇది ఏర్పాటు చేయబడింది.
*  భారత దేశం రాజ్యాంగం ప్రకారం, ఒక సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.
* భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణలు భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క కూర్పు, అధికార పరిధిని నిర్దేశించాయి.
*  ప్రధానంగా, ఇది రాష్ట్రాలు, ప్రాంతాల్లోని హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సవాలు చేసే అప్పీళ్లను స్వీకరించే ఒక పునర్విచారణ ధర్మాసనంగా పనిచేస్తుంది. అయితే తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో అధికార పిటి‌షన్‌లను లేదా తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాలకు సంబంధించిన కేసులను కూడా ఇది విచారణకు స్వీకరిస్తుంది.  
* భారతదేశం సౌర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడిన రెండు రోజుల తరువాత, 1950 జనవరి 28న, సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది.
*  పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లో దీనిని ప్రారంభించారు. దీనికి ముందు ప్రిన్సెస్ ఛాంబర్‌లో 12 ఏళ్లపాటు, 1937 నుంచి 1950 వరకు భారత సమాఖ్య న్యాయస్థానాన్ని నిర్వహించారు.ఇప్పుడు న్యాయస్థానం కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన సముదాయం సిద్ధమయ్యే వరకు, అంటే 1958 వరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు కూడా ఈ ఛాంబర్‌లోనే కొనసాగాయి.
* 1950 జనవరి 28లో స్థాపించిన తరువాత, సుప్రీంకోర్టు తన విచారణలను పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ ఛాంబర్‌లోనే ప్రారంభించింది. న్యాయస్థానం ప్రస్తుత భవనంలోకి 1958లో మార్చబడింది. 

views: 646

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams