Current Affairs Telugu Daily

దక్షిణాది వర్సిటీల్లో మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం
 * ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ).. దక్షిణాది వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించింది. 
* అలాగే జాతీయస్థాయిలో ఆరో ర్యాంకును సొంతం చేసుకొన్నది. 33 అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల పనితీరును మదింపువేసి 2018 సంవత్సరానికి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఈ ర్యాంకులను కేటాయించింది.
* ర్యాంకుల వివరాలను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్  ఢిల్లీలో విడుదలచేశారు. 2016లో జాతీయస్థాయిలో 12వ ర్యాంకు సాధించిన పీజేటీఎస్‌ఏయూ.. ప్రస్తుతం తన స్థానాన్ని మెరుగుపరుచుకొని ఆరో ర్యాంకు చేరింది.
* ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల వర్సిటీ వైస్‌చైన్సలర్ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు హర్షం వ్యక్తంచేశారు. 
* సామాజిక పర్యావరణ బాధ్యతలతో ప్రపంచస్థాయిలో పోటీపడగలిగే వ్యవసాయరంగ నిపుణుల్ని తీర్చిదిద్దడానికి నిరంతరం కృషిచేస్తున్నామని చెప్పారు.
* తమ విద్యార్థులు రూపొందించిన అనేక ప్రాజెక్టులు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అభినందనలు పొందాయని డాక్టర్ ప్రవీణ్‌రావు తెలిపారు.
* ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, 1964లో హైదరాబాదులో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం, 1963, ప్రకారం * ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క పరిధిలో ఉన్న వ్యవసాయ, పశువైద్య కళాశాలను, ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాలను, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో * ఉన్న శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల, ఆంధ్రా పశువైద్య కళాశాల, తిరుపతిలను జూన్ 1964లో ఈ కొత్త విశ్వవిద్యాలయపు పరిధిలోకి తెచ్చారు.
* 1996 నవంబర్ 7న దీని పేరుని ప్రముఖ రైతు నాయకుడు ఆచార్య ఎన్.జీ.రంగా పేరు మీద ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చటం జరిగింది.
* 1964, జూన్ 12న హైదరాబాదులో స్థాపించబడిన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒ.పుల్లారెడ్డి ప్రథమ ఉపసంచాలకునిగా పనిచేశాడు

views: 775

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams