Current Affairs Telugu Daily

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌
* ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ డాబర్‌ ఇండియ చైర్మన్‌గా అమిత్ బర్మన్‌ ఎంపికయ్యారు.
* ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఆనంద్‌ బర్మన్‌ ఇటీవల రాజీనామా చేయడంతో ఈ కొత్త నియామకం జరిగింది.
* మోహిత్‌ బర్మన్‌ వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. 
* రూ. 8500 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని కలిగిన దేశంలోని పురాతన వినియోగ వస్తువుల కంపెనీ పగ్గాలు తరువాతి తరం చేతుల్లోకి మారాయి.
* సీఈవో పదవినుంచి తప్పుకున్న సునీల్ దుగ్గల్‌ బోర్డునకు కూడా రాజీనామా చేశారు. 
* ఈ ఏడాది జనవరిలో మోహిత్ మల్హోత్రాను సీఈవోగా నియమించింది 
* వ్యవస్థాపక బర్మన్‌ కుటుంబంనుంచి  ఐదవతరం సభ్యుడైన అమిత్‌ బర‍్మన్‌(50) డాబర్‌లో అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈయన కంపెనీ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. 
* డాబర్‌ ఫుడ్స్‌ పేరుతో సంస్థను స్థాపించిన అమిత్‌ 12 ఏళ్ల తరువాత దీన్ని మాతృసంస్థ డాబర్‌ ఇండియలో విలీనం చేశారు.
* సహజ ఉత్పత్తుల విక్రయం పేరుతో 1884లో డా.ఎస్.కె. బర్మన్ డాబర్‌ కంపెనీని స్థాపించారు.

views: 747

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams