Current Affairs Telugu Daily

ఏపీలో మరో పథకం ..వైఎస్సార్‌ నవోదయం
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మ‌రో కొత్త పథకం ప్రకటించింది. వైఎస్సార్‌ నవోదయం కింద కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
* రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
* ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
* జిల్లాల వారీగా 86 వేల ఎంఎస్‌ఎంఈల ఖాతాలను గుర్తించారు
* రూ.4వేల కోట్ల రుణాలను వన్‌టైమ్‌ రీస్ట్రక్చర్‌ చేయనున్నారు. 
* ఏపీఈడీబీ-2018 చట్టం రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో ఏపీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌, మానిటరింగ్‌ యాక్ట్‌(ఏపీఐపీఎంఏ)కు ఆమోదం తెలిపింది.
* పెట్టుబడుల ఆకర్షణ, బ్రాండింగ్‌, ప్రాజెక్టులకు అనుమతి, నిధుల సమీకరణ, పరిశ్రమల కాలుష్యంపై నియంత్రణ, విధానాల రూపకల్పనే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 
* సీఎం ఛైర్మన్‌గా, ఏడుగురు డైరెక్టర్లతో ఏపీఐపీఎంఏ బోర్డును నియమించనున్నారు. 
* డైరెక్టర్లలో ఆర్థిక, పరిశ్రమల శాఖ మంత్రులు, సీఎస్‌ ఉండనున్నారు.

views: 1478

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams