Current Affairs Telugu Daily

AP పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ)గా కొనకంటి శ్రీనివాసరెడ్డి 
రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ)గా కొనకంటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు.
* మూడేళ్ల పాటు ఈ పోస్టులో కొనసాగుతారు. 
* క్రిమినల్‌ కేసులను వాదించడంలో శ్రీనివాసరెడ్డికి మంచి పేరుంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టు భర్తీకి సర్కారు ఇటీవల ముగ్గురు న్యాయవాదుల ప్యానెల్‌ను హైకోర్టుకు పంపింది. 
* నిబంధనల ప్రకారం ఈ ప్యానెల్‌ నుంచి హైకోర్టు శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసి, అందుకు సంబంధించిన లేఖను ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. హైకోర్టు సిఫారసు మేరకు ప్రభుత్వం శ్రీనివాసరెడ్డిని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
* శ్రీనివాసరెడ్డి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూషన్లు, అప్పీళ్లు, ఇతర ప్రొసీడింగ్స్‌ చేపడతారు. 

views: 784

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams