Current Affairs Telugu Daily

రెండో స్థానంలోకి జియో
* వినియోగదారుల సంఖ్యాపరంగా భారతీ ఎయిర్‌టెల్‌ని దాటేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) విడుదల చేసిన మే నెల నివేదికలో తేలింది.
* ట్రాయ్‌ నివేదిక ప్రకారం 387.55 మిలియన్ల వినియోగదారులతో వొడాఫోన్‌-ఐడియా ప్రథమ స్థానంలో నిలవగా, రిలయన్స్‌ జియో (323 మిలియన్లు), ఎయిర్‌టెల్‌ (320.38 మిలియన్లు)వినియోగదారులతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 
* ఈ ఏడాది మే నెలలో ఎయిర్‌టెల్ 15.1 లక్షలు, వొడాఫోన్‌-ఐడియా 57 లక్షల మంది వినియోగదారులను కోల్పోయినట్లు ట్రాయ్‌ నివేదికలో వెల్లడించింది.
* మే నెలలో 82 లక్షల మంది కొత్త వినియోగదారులు రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌లో చేరినట్లు ట్రాయ్‌ నివేదిక స్పష్టం చేసింది. 

views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams