Current Affairs Telugu Daily

అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య జూనియర్ వరల్డ్‌కప్‌లో సరబ్‌జోత్‌కు బంగారు పతకం 
* అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత షూటర్ సరబ్‌జోత్ సింగ్ బంగారు పతకం సాధించాడు.
* అమెరికాలోని కాలిఫోర్నియాలో జూలై 18న జరిగిన పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 17 ఏళ్ల సరబ్ మొత్తం 239.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించాడు.
* ఈ విభాగంలో రజత, కాంస్యాలు చైనాకు దక్కాయి.
* షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత్ తొమ్మిదేసి స్వర్ణ, రజత, నాలుగు కాంస్యాలతో మొత్తం 22 పతకాలు ఖాతాలో వేసుకొని అగ్రస్థానంలో కొనసాగుతోంది.
* భారత్ తర్వాతి స్థానంలో చైనా(7 స్వర్ణ+ 7 రజత+ 6 కాంస్యం) ఉంది.

views: 682

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams