Current Affairs Telugu Daily

భారత్ వృద్ధి రేటు 7శాతం అంచనా వేసిన  ఏడీబీ (ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్)
* 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది.
* ఈ మేరకు గతంలో వెలువరించిన అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 
* 2019లో ఆసియా అభివృద్ధికి సంబంధించి అవుట్‌లుక్ (ఏడీఓ)ను జూలై 18న ఏడీబీ విడుదల చేసింది.
ఏడీబీ అవుట్‌లుక్‌లోని అంశాలు...
* 7 శాతం వృద్ధి సాధించినా.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుంది
* అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వృద్ధి మందగమనం వంటి అంశాలు భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల దేశ వృద్ది అంచనాలను 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గిస్తున్నాం. దీంతో భారత్ వృద్ధి అంచనా 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింది.
* 2019లో చైనా వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. 2020లో ఇది మరింతగా 6.1 శాతానికి తగ్గవచ్చు. అమెరికాతో వాణిజ్య యుద్ధ దీనికి ప్రధాన కారణం.
* 2019-20తో పోల్చితే 2020-21లో భారత్ వృద్ధి రేటు స్వల్పంగా 7 శాతం నుంచి 7.2 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
* 2019లో ఆసియా ప్రాంత జీడీపీ 5.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
* 2019-20లో భారత్ వృద్ధిని ఏడీబీ తగ్గించడం ఇది రెండవసారి. తొలుత ఈ రేటును 7.6 శాతంగా అంచనావేసింది. అయితే ఏప్రిల్‌లో 7.2 శాతానికి తగ్గించింది. ఇప్పుడు అంచనాలకు మరో 20 బేసిస్ పాయింట్ల కోత పెట్టింది.

views: 703

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams