Current Affairs Telugu Daily

ఎయిర్‌ ఇండియాపై మంత్రివర్గ కమిటీ ఏర్పాటు
* ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 18న కొత్త మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది.
* ఈ కమిటీకి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా అధ్యక్షత వహించనున్నారు. 
* కమిటీలో సభ్యలుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్‌దీప్‌సింగ్ పూరి ఉండనున్నారు. 
* ఎయిర్ ఇండియా విక్రయానికి సంబంధించిన నమూనాలపై ఈ ప్యానెల్ పనిచేయనుంది. 
* ఎయిర్ ఇండియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో మంత్రులు నితిన్‌గడ్కరీ, అశోక్‌గజపతి రాజు, సురేష్‌ప్రభు, పీయూష్ గోయల్ ఉన్నారు.
* ఎయిర్ ఇండియా భారతీయ విమానయాన సర్వీసు. 
* భారత ప్రభుత్వరంగ సంస్థ.2007 ఫిబ్రవరీ 22న దీనిని ఇండియన్ ఎయిర్‌లైన్స్తో మిళితం చేశారు.
* ఈ ఎయిర్‌లైన్స్, ప్రపంచవ్యాప్తంగా 146 అంతర్జాతీయ, జాతీయ నౌకాశ్రయ గమ్యాలు కలిగివున్నది.
* భారతదేశంలో దీనికి 12 గేట్ వేలు గలవు.
* ఎయిర్ ఇండియా ఆరంభంలో టాటా ఎయిర్‌లైన్స్‌ పేరుతో 1932 అక్టోబర్ 15న జె.ఆర్.డి.టాటాచే టాటాసన్స్ లిమిటెడ్ (ప్రస్తుత టాటా గ్రూప్) సంస్థలో ఒక భాగంగా ప్రారంభం అయింది. 
* ఎయిర్ ఇండియా సంస్థాపకుడు జె.ఆర్.డి టాటా
* 1946 జూలై 26 నుండి టాటా ఎయిర్ లైన్స్, ఇండియన్ ఎయిర్ లైన్స్ పేరుతో ప్రభుత్వ సంస్థగా మారింది.
*ఎయిర్ ఇండియా తొలి  ప్రయాణం కరాచీలోని డ్రిగ్‌రోడ్ ఏరోడ్రోమ్ నుండి అలహాబాదు మీదుగా బాంబే జుహూ ఎయిర్‌ స్ట్రిప్ వరకు సాగింది. రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పైలెట్ నెవిల్ విన్సెంట్ సారథ్యంలో ఈ ప్రయాణం సాగింది. తరువాత ఈ ప్రయాణం బళ్ళారి మార్గంలో మద్రాసు వరకు సాగింది.
* 1948 జూన్ మాసంలో మలబార్ రాజకుమారి పేరుతో లోక్‌హీడ్ కాంస్టలేషన్ ఎల్-749ఎ (L-749A) ని విటి-సిక్యుపి (VT-CQP) నమోదు చేసి మొదటి భారత విమాన అంతర్జాతీయ సర్వీసు * బాంబే నుండి జెనీవా మార్గంలో లండన్ వరకు తొలి ప్రయాణం సాగించింది. 
* భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948లో భారత ప్రభుత్వం కోరిన కాణంగా ఎయిర్ లైన్స్‌ లోని 49% వాటా ప్రభుత్వం స్వాధీనపరచుకుంది.

views: 641

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams