Current Affairs Telugu Daily

గోల్ఫ్ చాంపియన్‌షిప్ విజేతగా అర్జున్
* ఎఫ్‌సీజీ కల్లావే జూనియర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన అర్జున్ భాటి విజేతగా నిలిచాడు.
* అమెరికాలోని కాలిఫోర్నియా పామ్ డెజర్ట్‌లో జూలై 18న జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో అర్జున్ 199 స్ట్రోక్స్ త్రో మొదటి స్థానంలో నిలిచి ట్రోఫీ దక్కించుకున్నాడు.
* అర్జున్ తర్వాతి స్థానాల్లో వరుసగా తైవాన్ ఆటగాడు జెరేమీ చెన్(202 స్ట్రోక్స్), న్యూజిలాండ్ ఆటగాడు జోషువా బై(207) నిలిచారు. 
* ఈ టోర్నీలో 40 దేశాల నుంచి మొత్తం 637 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. 
* నోయిడాకు చెందిన అర్జున్ భాటి ఇప్పటివరకు 150 టోర్నమెంట్లలో పాల్గొని 110 టైటిళ్లు గెలిచాడు

views: 667

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams