Current Affairs Telugu Daily

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్ రమేశ్ టెండూల్కర్‌
* అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్‌కు స్థానం లభించింది.
* సచిన్‌తోపాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అలన్ డోనాల్డ్, ఆసీస్ మాజీ మహిళా క్రికెటర్ క్యాథిరిన్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కింది.
* ఈ విషయాన్ని జూలై 18న ఐసీసీ వెల్లడించింది.
* భారత్ నుంచి సచిన్ కన్నా ముందు బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్ గవాస్కర్(2009), కపిల్‌దేవ్(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018) ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించారు. 
* ఈ కార్యక్రమాన్ని లండన్‌లో నిర్వహించారు.
* ఐసిసి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఐసిఎ) సహకారంతో ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేంను జనవరి 2, 2009 న దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రారంభించింది.
* మొదటగా 1999 నుండి 2003 వరకు జరిగిన FICA హాల్ ఆఫ్ ఫేమ్‌లో 55 మంది ఆటగాళ్ళుకు స్థానం లభించింది.
* హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. 2010 లో, 1973 లో ప్రారంభమైన మహిళల ప్రపంచ కప్‌లో జట్టును విజయానికి నడిపించిన మాజీ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ రాచెల్ హేహో ఫ్లింట్, హాల్ ఆఫ్ ఫేమ్‌లో మొదటి మహిళ అయ్యారు

views: 603

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams