Current Affairs Telugu Daily

పి.టి. ఉషకు ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డు
* భారత మాజీ అథ్లెట్, దిగ్గజ ఒలింపియన్ పి.టి. ఉషను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రతిష్టాత్మక ‘వెటరన్ పిన్’ అవార్డుకు ఎంపిక చేసింది.
* ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 24న జరగనున్న ఐఏఏఎఫ్ కాంగ్రెస్‌లో 55 ఏళ్ల ఉషకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
* ప్రపంచ అథ్లెటిక్స్‌లో సుదీర్ఘ కాలం పాటు చేసే సేవలకు గుర్తింపుగా ఐఏఏఎఫ్ వెటరన్ పిన్ అవార్డును అందజేస్తున్నారు. 
* పి.టి. ఉష పూర్తి పేరు పిలావుళ్ళకండి తెక్కేపఱంబిల్ ఉష.
* భారత దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పి.టి.ఉష  కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో  1964 june 27న జన్మించింది.
* 1979 నుంచి, భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని, దేశానికి పలు విజయాలను అందించింది.
* ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్
* 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది.
* 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, 1990 ఆసియాడ్ లో 3 రజిత, 1994 ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది.
* 1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.
* ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డు లతో సత్కరించింది.
* అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.

views: 608

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams