Current Affairs Telugu Daily

ద్వారకా క్షేత్రానికి ఐఎస్‌వో గుర్తింపు
* పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రానికి వరుసగా రెండో ఏడాదీ ఐఎస్‌వో గుర్తింపు లభించింది.
*ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలను అందిస్తున్నందుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఐఎస్‌వో 22200:2018 ధ్రువపత్రాన్ని అందించింది.
* హెచ్‌వైఎం ఎండీ ఆలపాటి శివయ్య దేవస్థానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈవో పెద్దిరాజులకు  ఈ ధ్రువపత్రాన్ని అందజేశారు.
* చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు నిత్యం 10వేల నుంచి 15వేల మంది భక్తులు తరలివస్తుంటారు.
*  దేవస్థానం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు గతేడాది ఐఎస్‌వో ధ్రువపత్రం లభించింది.

views: 842Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams