Current Affairs Telugu Daily

ఎస్‌బీఐపై 7 కోట్ల జరిమానా విధింపు
* ప్రభుత్వ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7 కోట్ల జరిమానా విధించింది.
ఆస్తుల గుర్తింపునకు సంబంధించిన నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ మేరకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ  ప్రకటించింది.
* ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ (ఐఆర్‌ఏసీ) నిబంధనలు.. కరెంట్ ఖాతాలను తెరవడం, నిర్వహించడానికి సంబంధించిన డేటాను సీఆర్‌ఐఎల్‌సీకి అందించడంలో ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతో పాటు మోసాలకు అవకాశం ఉన్నటువంటి సమాచారాన్ని అందించనందుకు ఈ పెనాల్టీ విధించింది.
* 19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా 2 జూన్, 1806 న స్థాపించబడింది. 
* తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన) మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1921 లో స్థాపన) ] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. 
* ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెనిగా కార్యకలాపాలు నిర్వహించింది.
* దేశంలో రిజర్వు బ్యాంకు స్థాపించేవరకు ఈ బ్యాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడా నిర్వహించింది.
* భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము 30 ఏప్రిల్, 1955 నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటు చేయబడిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానకార్యాలయం - ముంబాయి, భారతదేశం.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్: రజనీష్ కుమార్

views: 700



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams