Current Affairs Telugu Daily

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సుభాష్‌ గర్గ్‌ 
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆర్థిక వ్యవహారాల విభాగం(DEA) కార్యదర్శిగా సుభాష్‌చంద్ర గర్గ్‌ 2017 జులై 12న బాధ్యతలు చేపట్టారు. 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన గార్గ్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, శ్రీలంకల ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. 2017 మే 31న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌ పదవీ విరమణ చేశారు. దీంతో కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి తపన్‌రాయ్‌కు అదనపు బాధ్యతలుఅప్పగించగా, 2017 జులై 12న సుభాష్‌ గర్గ్‌ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.
DEA-Department of Economic Affairs

views: 957

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams