Current Affairs Telugu Daily

బ్యాంకాక్‌లో ఆసియాన్ మంత్రుల సదస్సు
*  థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జూలై 12, 13 తేదీలలో 13వ ఆసియాన్(అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఆసియన్ నేషన్స్) దేశాల రక్షణ మంత్రుల సదస్సును నిర్వహించారు.
* ఆగేయాసియా (ఆసియాన్‌) ప్రాంత దేశాలకు సుస్థిరత, భద్రతను చేకూర్చేందుకు సంబంధించిన ఒప్పందంపై ఇక్కడ జరిగిన సదస్సులో ఆసియాన్‌ దేశాల రక్షణ మంత్రులు  సంతకాలు చేశారు. 
* ఆసియాన్‌ దేశాలకు ఎదురయ్యే సంప్రదాయేతర, అంతర్దేశీయ ముప్పులను ఎదుర్కోవటంలో పరస్పరం సహకరించుకోవాలని ఈ ఒప్పందంలో నిర్ణయించుకున్నట్లు ఆసియాన్‌ దేశాల రక్షణ మంత్రులు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 
* మీడియా సమావేశంలో ఆతిథ్య దేశం  థాయ్‌లాండ్  ఉపప్రధాని, రక్షణ మంత్రి ప్రవిట్‌ వాంగ్సువాన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 
* ఈ సదస్సుకు సారధ్యం వహించిన ప్రవిట్‌ మీడియాతో మాట్లాడుతూ ఈప్రాంత భద్రతకు ఎదురవుతున్న కీలక సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఆరు కాన్సెప్ట్‌ పత్రాలను సదస్సు ఆమోదించిందని చెప్పారు.
* సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు, సరిహద్దుల నిర్వహణలో రక్షణ వ్యవస్థల మద్దతు, కూటమి సభ్యదేశాల మధ్య డైరెక్ట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఏర్పాటు, ఆసియాన్‌ దేశాల సైనిక వైద్య నిపుణుల సదస్సు ఏర్పాటు, సముద్ర జలాల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలతో ఈ కాన్సెప్ట్‌ పత్రాలను రూపొందించినట్లు ఆయన వివరించారు.
* ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతంగా వున్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని శాంతియుత ప్రాంతంగా మార్చేందుకు అన్ని దేశాలూ నిర్మాణాత్మక సహకారాన్ని అందించాలని ఆసియాన్‌ రక్షణ మంత్రుల సదస్సు విజ్ఞప్తి చేసింది.
* ఆసియాన్ ముందు జూలై 31, 1961 లో అసోసియేషన్ ఆఫ్ ఆగ్నేయాసియా (ASA) అని పిలువబడింది, ఈ బృందం థాయిలాండ్, ఫిలిప్పీన్స్ మరియు ఫెడరేషన్ ఆఫ్ మలయాతో కూడి ఉంది. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ మరియు థాయిలాండ్ అనే ఐదు దేశాల విదేశాంగ మంత్రులు ఆసియాన్ ప్రకటనపై సంతకం చేసినప్పుడు 1967 ఆగస్టు 8 న ఆసియాన్ సృష్టించబడింది. డిక్లరేషన్లో పేర్కొన్నట్లుగా, ఆసియాన్ యొక్క లక్ష్యాలు మరియు ప్రయోజనాలు ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి మరియు సాంస్కృతిక అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రాంతీయ శాంతిని ప్రోత్సహించడం, సాధారణ ఆసక్తి విషయాలపై పరస్పర సహకారం, ఒకరికొకరు సహాయం అందించడం. శిక్షణ మరియు పరిశోధనా సదుపాయాల రూపంలో, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి వ్యవసాయం మరియు పరిశ్రమలను బాగా ఉపయోగించుకోవటానికి సహకరించడం, ఆగ్నేయాసియా అధ్యయనాలను ప్రోత్సహించడం మరియు ఇలాంటి లక్ష్యాలు మరియు ప్రయోజనాలతో ప్రస్తుత అంతర్జాతీయ సంస్థలతో సన్నిహితమైన, ప్రయోజనకరమైన సహకారాన్ని నిర్వహించడం.
* ఆసియాన్ సభ్యదేశాలు; బ్రూనై,కాంబోడియా,ఇండోనేసియా,లావోస్,మలేసియా,మయన్మార్,ఫిలిప్పీన్స్,సింగపూర్,థాయ్‌లాం,థాయ్‌లాండ్

views: 709



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams