Current Affairs Telugu Daily

అసోంకు రూ.250 కోట్ల కేంద్ర సాయం విడుదల
* వర్షాలు, వరదలు కారణంగా అతలాకుతలమవుతున్న అసోం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా  రూ.251.55 కోట్లు విడుదల చేసింది.
* సహాయక పనులకు గాను రాష్ట్ర విపత్తుల నివారణ నిధికి (ఎస్‌డీఆర్‌ఎఫ్)కి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. 
* అసోంలో వరద ముంపునకు గురైన జిల్లాల్లో బ్రహ్మపుత్ర, దాని ఉప నదులు ప్రమాద స్థాయి నుంచి ప్రవహిస్తున్నట్టు రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ వెల్లడించింది. 
* రాష్ట్రంలోని 33 జిల్లాలు వరద ముంపునకు గురికాగా, ఇంతవరకూ మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. 45 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

views: 641Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams