Current Affairs Telugu Daily

ఈయూ కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా
* యూరోపియన్ యూనియన్(ఈయూ) కమిషన్ అధ్యక్షురాలిగా జర్మనీ రక్షణ మంత్రి ఉర్సులా వన్ డెర్ లియెన్ ఎన్నికైంది.
* జూలై 16న జరిగిన ఈయూ కమిషన్ అధ్యక్ష ఎన్నికల్లో ఉర్సులా విజయం సాధించింది. 
* దీంతో ఈయూ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా ఉర్సులా నిలిచింది. 
* జర్మనీ రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కూడా ఉర్సులా గుర్తింపు పొందింది.
* ఈయూ కమిషన్ అధ్యక్షురాలిగా 2019, నవంబర్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
* ఐరోపా సమాఖ్య (యూరోపియన్ యూనియన్) ఐరోపాలో ఉన్న 28 సభ్యదేశాల రాజకీయ మరియు ఆర్థిక సమాఖ్య. ప్రాంతీయ సమైక్యతకు కట్టుబడిన ఐరోపా సమాఖ్య 1993నాటి మాస్ట్రిచ్ ఒడంబడిక ఆధారంగా, అప్పటికే పనిచేస్తున్న ఐరోపా ఆర్థిక సముదాయము (యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) పునాదిగా స్థాపించబడింది.
* 50 కోట్ల జనాభా పైబడి కలిగిన ఐరోపా సమాఖ్య, స్థూల ప్రపంచ ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉంది.
* ఐరోపా సమాఖ్యలోని పదహారు సభ్యదేశాలు యూరోను అధికారిక మారక ద్రవ్యంగా కలిగియున్నాయి - వీటిని సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు

views: 611

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams