Current Affairs Telugu Daily

చండీగఢ్ వర్శిటీతో టీసీఎస్ ఒప్పందం
* డిగ్రీ స్థాయిలో నూతన ఇంజినీరింగ్ కోర్సు ఏర్పాటు విషయమై చండీగఢ్ విశ్వవిద్యాలయంతో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైయి అండ్ బిజినెస్ సిస్టమ్స్ (సీఎస్‌బీఎస్) పేరుతో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును నిర్వహించడానికి ఈ అంగీకారం కుదిరింది.
* పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నిపుణులను రూపొందించే విధంగా కోర్సును రూపొందించారు. 
* ఈ మేరకు చంఢీగఢ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.ఎస్.బావా, టీసీఎస్ మానవ వనరుల విభాగం అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు రంజన్ బందోపాధ్యాయ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
* పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో చండీగఢ్ విశ్వవిద్యాలయం ఉంది.
*టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS ) ముంబై, భారతదేశంలో ముఖ్యకార్యాలయం కలిగిన సాఫ్ట్ వేర్ సేవలు మరియు కన్సల్టింగ్ సంస్థ.
* ఇది భారతదేశంలోని అతిపెద్ద సమాచార సాంకేతిక మరియు బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సేవలను అందించే కంపెనీ.
* ఈ కంపెనీ భారతదేశంలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ల జాబితాలలో చేర్చబడింది.
*టీసీఎస్  భారతదేశంలోని అతిపెద్ద మరియు పురాతనమైన సాఫ్ట్ వేర్ సేవలు మరియు కన్సల్టింగ్ సంస్థ.
* టీసీఎస్  1968వ సంవత్సరంలో స్థాపించబడి భారత IT పరిశ్రమకు దారిచూపింది.
* ఇది టాటా సమూహంలోని ఒక విభాగం "టాటా కంప్యూటర్ సెంటర్"గా ప్రారంభించబడింది, దీని ముఖ్యకర్తవ్యం సమూహంలోని ఇతర కంపెనీలకు కంప్యూటర్ సేవలను అందించడం. F C  కోహ్లి దీనికి  మొదటి జనరల్ మేనేజర్.
*టీసీఎస్ JRD టాటా దీని మొదటి ఛైర్మన్.
* టీసీఎస్  ప్రధానకేంద్రము-   ముంబై, ఇండియా.
* టీసీఎస్  సి ఈ ఒ - రాజేష్ గోపీనాథన్

views: 602

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams