Current Affairs Telugu Daily

ఐఎస్‌ఎస్‌ఎఫ్ టోర్నీలో అనీశ్ కు స్వర్ణం

* అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచ కప్ టోర్నీలో భారత షూటర్ అనీశ్ భన్వాలాకు స్వర్ణ పతకం లభించింది.
* జర్మనీలో జరుగుతున్న ఈ పోటీల్లో జూలై 17న జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అనీశ్ 29 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు.
* ఇగోర్ ఇస్మకోవ్ (రష్యా-23 పాయింట్లు) రజతం, ఫ్లోరియాన్ పీటర్ (జర్మనీ-19 ) కాంస్యం సాధించారు.
* జూలై 19 జరిగే ఐఎస్‌ఎస్‌ఎఫ్ టోర్నిలో ఇప్పటివరకు భారత్ 8 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 20 పతకాలు సాధించి అగ్రస్థానంలో ఉంది


views: 651



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams