Current Affairs Telugu Daily

జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
* భారత వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో కొత్తగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ-నేషనల్ మెడికల్ కౌన్సిల్)ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం జూలై 17న ఆమోదం తెలిపింది.
* ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 
* ఈ బిల్లును కేంద్రం 2017 డిసెంబర్‌లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ 16వ లోక్‌సభ గడువు ముగిసే నాటికి అది ఆమోదం పొందకపోవడంతో రద్దయింది.
* ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షను అందరికీ ఉమ్మడిగా జాతీయ నిష్క్రమణ పరీక్ష (నెక్స్ట్-నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరిట నిర్వహించేలా బిల్లులో నిబంధనలున్నాయి.
మరోవైపు నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ చట్టం-2014ను సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది.
* మరో నాలుగు ఎన్‌ఐడీలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, వాటిని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలుగా ప్రకటించేందుకు ఈ సవరణను చేపడుతున్నారు. 
* అమరావతి, భోపాల్, జొర్హాత్, కురుక్షేత్రల్లోని ఎన్‌ఐడీలను కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తేనున్నారు

views: 654



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams