Current Affairs Telugu Daily

విఠలాచార్యకు దాశరథి పురస్కారం
*ప్రముఖ కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు దాశరథి పురస్కారం-2019 లభించింది.
*ఈ అవార్డును దాశరథి 95వ జన్మదినం రోజు( జూలై 22)నప్రధానం చేయనున్నారు.
* నల్లగొండ జిల్లా వెల్లంకిలో జన్మించిన విఠలాచార్యపద్యం, గద్యం, నాటకం, బుర్రకథ, వ్యాసం, బాలసాహిత్యంతో పాటు పలు పక్రియల్లో రచనలు చేశారు.
* తెలుగు సాహిత్యానికి కూరెళ్ల విఠలాచార్య చేసిన సేవ కు ఆయనను ఎన్నో సాహిత్య పురస్కారాలు, బిరుదులు వరించాయి.
* తెలుగు పాండిత్యంలో ఆయనది అందెవేసిన చెయ్యి. దాదాపు ఎనిమిది పత్రికలు స్థాపించి, నిర్వహించి తెలుగు సాహిత్యాన్ని నలుమూలలకు వ్యాప్తిచేశారు.
* ఎన్నో సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థలు నెలకొల్పారు. ప్రస్తుతం కూరెళ్ల వయసు 81 సంవత్సరాలు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కూరెళ్ల లక్ష్మమ్మ, వెంకటరాజయ్య దంపతులకు జూలై 9, 1938లో జన్మించిన విఠలాచార్య. ఎంఏ (తెలుగు), బీఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీ విశారద (హిందీ) విద్యనభ్యసించారు. 
* విశ్రాంత తెలుగు ఉపన్యాసకులైన ఆయన పఠనం, పరిశోధన, రచన, సాహిత్య, సాంస్కృతిక, విద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవాకార్యక్రమాల నిర్వహణ, పల్లెపట్టుల్లో విద్యావ్యాప్తికి, సాహిత్యవ్యాప్తికి, గ్రంథాలయాల నిర్మాణానికి కృషిచేస్తున్నారు. 
* అభినవ పోతన, మధురకవి, సుధీతిలక, సాహిత్యబ్రహ్మ, ఆచార్య, తెలంగాణ వేమన, నల్లగొండ కాళోజీ, అక్షరకళాసమ్రాట్టు, కవితాశ్రీ, కవిభూషణ, సాహిత్యప్రపూర్ణ, మధురకవితా కళానిధి తదితర బిరుదులు ఆయనను వరించాయి.
* బాపూ భారతి, మన తెలుగుతల్లి, వలి వెలుగు, మన పురోగమనం, చిరంజీవి, ప్రియంవద, ముచికుంద, లేఖిని వంటి పత్రికలను ఆయన స్థాపించి, నిర్వహించారు.
* తెలుగు నవలల్లో స్వాతంత్య్రోద్యమ చిత్రణం పేరిట పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాన్ని, తెలుగులో గొలుసుకట్టు నవలలు పేరిట ఎంఫిల్ సిద్ధాంతగ్రంథాన్ని కూరెళ్ల వెలువరించారు.
* స్వాతంత్య్రోద్యమం- ఆంధ్రప్రదేశ్‌లో దాని స్వరూపం, విర్థలేశ్వర శతకం (సామాజిక స్పృహ నిండిన సచిత్ర పద్యకృతి), మధురకవి కూరెళ్ల పీఠికలు (సంపాదకులు దాసోజు జ్ఞానేశ్వర్), స్మృత్యంజలి, కవితాచందనం, కూరెళ్ల నానీలు, గో విలాపం తదితర గ్రంథాలు, పుస్తకాలు రచించారు.
*  70వేల పుస్తకాలతో వెల్లంకిలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
*  అభ్యుదయ కవి అయిన దాశరథి కృష్ణమాచార్య పేరిట తెలంగాణ ప్రభుత్వం దాశరథి అవార్డును ఏర్పాటుచేసింది.
* 2018లో ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు, 2017లో ఆచార్య ఎన్. గోపికి, 2016లో ప్రముఖ కవి బాపురెడ్డికి, 2015లో తిరుమల శ్రీనివాసాచార్యకు దాశరథి అవార్డు లభించింది.

views: 706

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams