Current Affairs Telugu Daily

58 పురాతన చట్టాల రద్దు
* కేంద్ర ప్రభుత్వం జూలై 17న మరో 58 పురాతన, వాడుకలోలేని చట్టాలను రద్దు చేసింది.
* దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు (గత, ప్రస్తుత) ప్రభుత్వాలు కలిసి రద్దు చేసిన పురాతన చట్టాల సంఖ్య 1,824కు చేరింది. చట్టాల రద్దు, సవరణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే మరో 137 పురాతన చట్టాలు కూడా రద్దు కానున్నాయి.
*  ప్రస్తుత పరిస్థితులకు ఈ పురాతన చట్టాలకు అసలు సంబంధమే లేదనీ, ఈ కాలానికి అవి పనికిరావని కేంద్రం చెబుతోంది.
*  తాజాగా రద్దయిన 58 చట్టాలేవో ఇంకా తెలియరాలేదు.

views: 657



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams