Current Affairs Telugu Daily

ప్రగతి ద్వారా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోడి సమావేశం
సచేతన పాలన-సకాల అమలు(ప్రగతి) వేదిక ద్వారా ప్రధాని నరేంద్రమోడి 2017 జులై 12న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులలో దూరవాణి సదస్సు విధానంలో మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ పనుల పురోగతిని నరేంద్రమోడి సమీక్షించారు. దేశంలో ఉన్న వ్యాపారులంతా ఆగస్టు 15వ తేదీలోగా వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) కింద పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని ప్రధాని మోడి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచించారు. 
PRAGATI-Pro-Active Governance and Timely Implementation

views: 957



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams