Current Affairs Telugu Daily

‘గివ్‌ అప్‌ కన్సెషన్‌’ ను ప్రారంభించిన సౌత్ సెంట్రల్ రైల్వే
*  రైలు ప్రయాణాల్లో సీనియర్‌ సిటిజన్లకు టికెట్లపై ఇస్తున్న రాయితీల భారాన్ని తగ్గించుకోవడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి పెట్టింది. 
*‘టికెట్‌ రాయితీని వదులుకోండి’ అంటూ వయోధికులకు విజ్ఞప్తి చేస్తోంది. 
* ఈ అంశంపై రూపొందించిన గోడ పత్రికను దక్షిణ మధ్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మల్య అధికారులతో కలిసి సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో  ఆవిష్కరించారు.
* తద్వారా మిగిలే మొత్తాన్ని ప్రయాణికుల సౌకర్యాల అభివృద్ధి కోసం, మెరుగైన సేవలు అందించేందుకు వెచ్చిస్తామని జీఎం పేర్కొన్నారు.
* సీనియర్‌ సిటిజన్లకు టికెట్లపై రైల్వేశాఖ రాయితీ ఇస్తోంది.
* పురుష ప్రయాణికుల వయసు 60 ఏళ్లు పైబడితే 40 శాతం, మహిళా ప్రయాణికులకు 58 ఏళ్లు పైబడితే 50 శాతం రాయితీ ఇస్తోంది. ‘గివ్‌ అప్‌ కన్సెషన్‌’ (రాయితీ వదులుకోండి) నినాదాన్ని రైల్వేశాఖ 2017లోనే తీసుకొచ్చింది.
* దీనిపై వయోధికుల్లో అవగాహన పెంచేందుకు గోడ పత్రికలు, ఇతర రూపాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తోంది రాయితీ వదులుకోవాలనుకునే వయోధికులు. కౌంటర్ల వద్ద, ఇంటర్నెట్‌లో లేదా అధీకృత ఏజెంట్ల వద్ద టికెట్లు రిజర్వేషన్‌ చేసుకునే సమయంలో తమ ఆప్షన్‌ తెలపాలని ద.మ.రైల్వే పేర్కొంది.
* భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే 1966, అక్టోబర్ 2న ఏర్పడింది. 
*ఈ రైల్వే జోన్ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే మండలములు ఉన్నాయి.
* తెలంగాణ లోని హైదరాబాదు, సికింద్రాబాదు, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ మండలములు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి.
* ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ మరియు  తెలంగాణలో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది.
* మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది.
* దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.

views: 762



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams