Current Affairs Telugu Daily

అమ‌రావ‌తికి  రుణం తిర‌స్క‌రించిన ప్ర‌పంచ బ్యాంక్
*‘అమరావతి సస్టెయినబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌’ని బ్యాంకు వెబ్‌సైట్‌లో ‘డ్రాప్డ్‌’ ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. 
* అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం వస్తుందని సీఆర్‌డీఏ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. 
* రాజధానికి రుణం ఇవ్వాలంటే పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానెల్‌ ఇటీవల స్పష్టంచేసింది.
* దానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని నేపథ్యంలో రుణం ప్రతిపాదనను విరమించుకుంటూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.
* రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌ తనిఖీకి సుముఖత వ్యక్తం చేయకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది.
*  రాజధానికి రుణం కావాలంటే వేరే మార్గంలో చూద్దామని, ప్రపంచబ్యాంకు తనిఖీకి అంగీకరిస్తే, ఆ ప్రభావం బ్యాంకు ఆర్థిక సాయంతో దేశంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టులపైనా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం.
* రాజధాని నిర్మాణానికి రూ.7200 కోట్ల రుణం కోసం సీఆర్‌డీఏ 2016 మార్చిలో ప్రపంచబ్యాంకుకి ప్రతిపాదన అందజేసింది.
* తొలి దశలో రూ.3,600 కోట్లు, రెండో దశలో మరో రూ.3,600 కోట్లు బ్యాంకు నుంచి తీసుకోవాలనేది ప్రతిపాదన. బ్యాంకు కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది.
* తాము మంజూరు చేసే రుణంలో 30 శాతం నిధులతో ముందస్తుగా రాజధానిలో పనులు చేపట్టేందుకు కూడా బ్యాంకు అంగీకరించింది.
* సీఆర్‌డీఏ మొదట ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణంతో ఈ ప్రాజెక్టులు చేపడితే, ప్రపంచబ్యాంకు రుణం మంజూరయ్యాక ఆ నిధుల్ని వాటికి తిరిగి చెల్లించవచ్చునన్నది ఆలోచన.
* రాజధానిలో ఏడు ప్రాధాన్యతా రహదారుల నిర్మాణాన్ని ప్రపంచబ్యాంకు నిబంధనలకు లోబడే సీఆర్‌డీఏ నిర్మిస్తోంది.
* రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు వ్యతిరేకంగా ఉన్న రైతులు కొందరు రాజధానిలో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌కి 2017 మే 25న ఫిర్యాదు చేశారు. 
* కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి జత కలిశాయి. దీనిపై ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌  బ్యాంకు యాజమాన్యాన్ని వివరణ కోరింది. 
* 2017 సెప్టెంబరు 12 నుంచి 15 వరకు తనిఖీ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది.
*  రైతులతో పాటు, రాజధానిలోని వివిధ వర్గాల ప్రజల్ని, ప్రభుత్వ అధికారుల్ని కలిసింది.
*  సెప్టెంబరు 27న ప్రాథమిక నివేదిక అందజేసింది. రాజధానిలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులవుతున్నవారికి మరింత మెరుగైన పునరావాస ప్యాకేజీ అందించేందుకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌ సూచనల మేరకు తగు చర్యలు చేపడతామని బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. 
* వాటన్నిటినీ పరిశీలించిన  ప్యానల్‌ ఇటీవల తుది నివేదిక అందజేసింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరింత లోతైన తనిఖీ అవసరమని పేర్కొంది.
*  ఆ నేపథ్యంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రపంచ బ్యాంకు మేనేజ్‌మెంట్‌ నుంచి ఒక లేఖ వచ్చింది. మరోసారి పూర్తిస్థాయిలో తనిఖీకి మీరు అంగీకరిస్తారో లేదో చెప్పాలన్నది ఆ లేఖ సారాంశం.
* ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడినందున తమ నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచబ్యాంకుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. 
* దానికి అంగీకరించని బ్యాంకు యాజమాన్యం రాజధానికి రుణం ప్రతిపాదనను విరమించుకుంది. 
*అమరావతిలో ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌ బృందం తనిఖీకి అనుమతివ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. 
* రుణం మంజూరు చేయడానికి ముందే ఇలా తనిఖీల పేరుతో హడావుడి చేయడం కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టవుతుందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో పలు ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రం పేర్కొంది. ఆ నేపథ్యంలోనే బ్యాంకు తనిఖీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని సమాచారం.
* ప్రపంచబ్యాంకు  1945 డిసెంబర్ 27 న ప్రపంచబ్యాంకు ఏరుపాటు  చేసారు. 
*  1946 జూన్ 25 న కార్యకలాపాలు మొదలు పెట్టింది.
* రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దేశ పునర్నిర్మాణానికై 1947 మే 9 న ఫ్రాన్సుకు మంజూరు చేసిన 250 మిలియను డాలర్లు బ్యాంకు అందించిన మొదటి ఋణం.
* ప్రపంచబ్యాంకు ప్రధాన కార్యాలయం - వాషింగ్టన్, D.C.
* ప్రపంచబ్యాంకు (అధ్యక్షుడు) డేవిడ్ మాల్పాస్

views: 798Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams