Current Affairs Telugu Daily

 జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో ఈషా సింగ్ కు  రజత పతకం
 * జర్మనీ వేదికగా జరుగుతున్న జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభా గం ఫైనల్‌ల్లో 14 ఏళ్ల హైదరాబాదీ అమ్మాయి ఈషా సింగ్ రజత పతకం సా ధించింది.
* మొత్తం 236.6 స్కోరు సాధించి టర్కీ షూటర్ తర్హన్(241.8) కంటే కాస్త వెనుకబడి స్వర్ణాన్ని చేజార్చుకుంది.
* ఇదే పోటీలో టర్కీకే చెందిన మరో క్రీడాకారిణి ఇల్‌మాజ్(215.4) కాంస్యాన్ని చేజిక్కించుకుంది. 
* ఐఎస్‌ఎస్‌ఎఫ్ టోర్నీలో ఈషాకు ఇది తొలి పతకం.
*25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల విభాగంలో బరిలోకి దిగిన అనీశ్ భన్వాల స్వర్ణ పతకంతో మెరిశాడు. 
*584 స్కోరుతో ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించిన అనీశ్..ఫైనల్లోనూ సత్తాచాటాడు. 29 స్కోరుతో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, ఎగరో ఇస్మకోవ్(23), ఫ్లోరియన్ పీటర్(19) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
* పురుషుల టీం విభాగంలో ఆగ్నేయా, రాజ్‌కన్వర్ సింగ్ సంధు, ఉదయ్ వీర్ సంధు 1709స్కోరు చేసి రజత పతకం సాధించారు.
* అలాగే 10మీటర్ల మిక్స్‌డ్ ఎయిర్‌రైఫిల్ విభాగంలో శ్రేయా అగర్వాల్, యశ్‌వర్ధన్ ద్వయం రజత పతకాన్ని సాధించగా... మెహులీ ఘోష్, హృదయ్ హజారికా జోడీ కాంస్యాన్ని కైవసం చేసుకుంది.
* టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఎనిమిది స్వర్ణాలు సహా తొమ్మిది రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

views: 704



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams