Current Affairs Telugu Daily

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సమీక్షిస్తే ఇబ్బందే
* విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కార్పొరేట్ రేటింగ్ సంస్థ ఫిచ్ హెచ్చరించింది.
*  సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఉత్పత్తి సంస్థల నగదు ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయని ఫిచ్‌ అభిప్రాయపడింది.
* ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఎలను విజయవంతంగానే పునఃసమీక్షించినప్పటికీ  విద్యుత్ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఫిచ్ తెలిపింది. 
* ఈ చర్యలతో ఆయా సంస్థలకు కొన్ని పరిమిత రుణ సంస్థలు అందించే బాండ్ల విలువ తగ్గిపోతుందని ఫిచ్‌ హెచ్చరిస్తోంది.
*  పీపీఏల పునఃసమీక్ష సహేతుకం కాదంటూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
*  ఫిచ్ వ్యవస్థాపకుడు జాన్ నోలెస్ ఫిచ్ ఇంక్.
* "బిగ్ త్రీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలలో"  ఫిచ్ ఒకటి.
* 1975 లో యు.ఎస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ గుర్తింపు పొందిన స్టాటిస్టికల్ రేటింగ్ సంస్థలలో ఇది ఒకటి.

views: 701

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams