Current Affairs Telugu Daily

15వ ఆర్థిక సంఘం గడువు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

*  కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని పెంచింది. నవంబర్‌ 30 వరకు అంటే నెల రోజుల పాటు గడువు పొడిగించింది.
*  దేశ అంతర్గత భద్రత, రక్షణకు మురిగిపోని విధంగా నిధులు కేటాయించేందుకు మార్గాలు సూచించాలని ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని ఆర్థిక సంఘాన్ని ఆదేశించింది.
* ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 15వ ఆర్థిక సంఘం లక్ష్యాలు, నిబంధనల్లో మార్పుల్ని ఆమోదించింది. భారత అంతర్గత భద్రత, రక్షణ కోసం పక్కాగా, సురక్షితమైన, మురిగిపోని విధంగా నిధుల కేటాయింపునకు మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది. సవరించిన నిబంధనలతో ఈ కేటాయింపుల కోసం ప్రత్యేక విధానం  దానిని నిర్వహణలోకి ఎలా తీసుకురావాలో పరిశీలించేందుకు ఆర్థిక సంఘానికి అవకాశం లభించింది.
*  అలాగే 2020-2025 కాలానికి సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక అవసరాలను అంచనా వేసేందుకు, సూచనలు చేసేందుకు అనుమతి దొరికింది.
* 15 వ ఆర్థిక సంఘం  ప్రసుత్త కమిషన్  చైర్మన్ ఎన్‌కె సింగ్.
*   మొదటి ఆర్థిక కమిషన్  ను భారత రాష్ట్రపతి 1951 లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద స్థాపించారు.
* ఆర్థిక సంఘం భారతదేశ కేంద్ర ప్రభుత్వం మరియు  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను నిర్వచించడానికి ఇది ఏర్పడింది.
* ఆర్థిక కమిషన్ రాజ్యాంగం ప్రకారం, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కమిషన్ నియమించబడుతుంది మరియు ఒక చైర్మన్ మరియు మరో నలుగురు సభ్యులను కలిగి ఉంటుంది.


views: 707



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams