Current Affairs Telugu Daily

తెలంగాణలో రెట్టింపైన ఆసరా పింఛను
* ఆసరా పెన్షన్‌దారులకు నెలకు ఇప్పటివరకు అందుతున్న వెయ్యి రూపాయల బదులు రూ.రెండువేల పదహార్లు, దివ్యాంగులకు రూ.1500 బదులు రూ.మూడువేల పదహార్లు పింఛన్‌కింద లభించనున్నాయి.
* రాష్ట్రంలో ఆసరా పథకం కింద రకరకాల వర్గాలకు నెలవారీగా ఇస్తున్న పింఛన్ సొమ్మును ఎన్నికల హామీ మేరకు పెంచింది.
*  జూన్ నెల నుంచి దీనిని అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అంటే జూలై నుంచి ప్రస్తుతం లభిస్తున్న పింఛన్ మొత్తం కంటే రెట్టింపుపైగా లబ్ధిదారులకు చేతికి అందుతుంది.
*  వాస్తవానికి ప్రభుత్వం మే నుంచే ఇచ్చేందుకు నిర్ణయించినా.. వరుసగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో అది సాధ్యంకాలేదు.
*  జూన్ నుంచి పెరిగిన పింఛన్లను పంపిణీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లుచేసింది.
*  ఇప్పటివరకు ఆసరా పింఛన్లు తీసుకుంటున్న 39.32 లక్షల మందికి రెండింతలకుపైగా మొత్తం అందుతుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, బోదకాలు వ్యాధిగ్రస్థులకు వెయ్యి రూపాయలకు బదులు రూ.2016, దివ్యాంగులకు రూ.1500 బదులు రూ.3016 లభించనున్నాయి.
* మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమల్లోకి రానున్నది. ప్రతి నెలా ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్ ఇకపై రూ.2016కు, దివ్యాంగులకు ఇచ్చే రూ.1500ను ఇకపై రూ.3016కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్  ఉత్తర్వులు జారీచేశారు.
*  ఇప్పటి వరకు ఆసరా పింఛన్ల కోసం ప్రతి నెలా దాదాపు రూ.418 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ఇకపై అదనంగా మరో రూ.424 కోట్లను దీనికి కేటాయించనున్నది. మొత్తంగా ఆసరా పథకానికి దాదాపు రూ.842 కోట్లు వెచ్చించనున్నది.
* రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు లక్షల 90వేల 709 మంది దివ్యాంగులకు నెలకు రూ.1500 చొప్పున రూ.73కోట్ల 60లక్షల 63వేల 500 ఇస్తుండగా ఇప్పుడు అదనంగా రూ.74 కోట్ల 39లక్షల తొమ్మిదివేల 940 ఇవ్వాల్సి ఉంటుంది. దివ్యాంగులకు మొత్తంగా నెలకు రూ.3016 చొప్పున రూ.147కోట్ల 99 లక్షల 73వేల 440 అందుతుంది.
*  అదేవిధంగా ప్రస్తుతం ఇతర ఆసరా లబ్ధిదారులు 34 లక్షల 41 వేల 600 మందికి నెలకు రూ.1000 చొప్పున రూ.344కోట్ల 16లక్షలు ఇస్తుండగా ఇప్పుడు అదనంగా రూ.349కోట్ల 66లక్షల 65 వేలు ఇవ్వాల్సి వస్తుంది. వీళ్లకు మొత్తంగా నెలకు రూ.2016 చొప్పున 693కోట్ల 82లక్షల 65వేలు అందుతుంది. మొత్తంగా అందరు ఆసరా పింఛన్‌దారులు.. 39 లక్షల 32వేల 309 మందికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.841 కోట్ల 82 లక్షల 38వేల 440 పంపిణీ చేస్తుంది.
*  ఇక కొత్తగా 57 ఏండ్ల నుంచి 64 ఏండ్లలోపు వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
* అయితే వరుసగా ఎన్నికల కోడ్ వస్తుండటంతో కొత్త పింఛన్ల ఎంపిక వాయిదా పడుతున్నది. త్వరలోనే కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టి, పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 
* సమైక్యరాష్ట్రంలో ముందుగా వృద్ధాప్య పింఛన్ రూ.75 ఇవ్వగా.. 2004 తర్వాత రూ.200కు పెంచారు కానీ తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో  పింఛన్ మొత్తాన్ని ఒకేసారి రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచారు.
*  ఒకరిపై ఆధారపడి బతికే దివ్యాంగుల పింఛన్ రూ.1500కు పెంచారు. తాజాగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని రెండింతలు చేస్తున్నారు.
*  అంతేకాకుండా అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదించారు.
*  ప్రస్తుతం రాష్ట్రంలో 39 లక్షల మందికి వివిధ రకాల ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వయస్సు తగ్గించడంతో దాదాపు మరో పది లక్షల మంది వరకు అదనంగా చేరుతారని ప్రాథమికంగా అంచనా వేశారు. 
* ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్లో రూ.12,067 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం పెంచిన పింఛన్లతో ప్రతి నెలా రూ.841.82 కోట్లు పంపిణీ చేయాల్సి వస్తుంది. కొత్తగా వచ్చేవారి సంఖ్య అదనం. 
* ఆసరా పింఛన్ల 2014 నవంబర్ 8 న మహబూనగర్ జిల్ల కొత్తూర్ లో ప్రారంభించారు .  

views: 694

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams