Current Affairs Telugu Daily

12 బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినేట్‌
* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.
*  శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, వివిధ చట్టాలకు చేయాల్సిన సవరణలపై చర్చించారు.
*  రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్ట్‌ రీటెండరింగ్‌ తదితర విషయాలను చర్చించారు.
* మొత్తం 12 బిల్లులకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
*  అంగన్వాడీల వేతనం రూ.1000 పెంపు, ఎస్సీ, ఎస్టీలకు రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ తదితర బిల్లులకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది.
*  కౌలు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా, భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
* భూ యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించే ముసాయిదా బిల్లుకు, భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్‌ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టంలో మార్పులకు ఉద్దేసించిన ముసాయిదాకు ఆమోద ముద్రవేసింది.
* మద్య నిషేధం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

views: 973

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams