Current Affairs Telugu Daily

 ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజోస్‌

 * ఆమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని పదిల పరుచుకున్నారు.
* ఇటీవల బ్లూంబర్గ్ బిలియనీర్‌ ఇండిక్స్‌ విడుదల చేసిన జాబితాలో ఈయన తొలిస్థానంలో నిలిచారు.
*  బెజోస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌  వెనక్కి నెట్టి ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు.
* ఆర్నాల్ట్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియన్ డాలర్లు కాగా, గేట్స్‌ ఆస్తుల మొత్తం 107 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 
* అమెజాన్‌ చీఫ్‌ బెఫ్‌ బెజోస్‌ తన భార్య మెకంజీ బెజోస్‌కు భారీగా భరణం సమర్పించుకున్నప్పటికీ 125బిలియన్‌ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు.
* బిల్‌గేట్స్‌ తన సంపదలోని 35 బిలియన్‌ డాలర్లను గేట్స్‌ అండ్‌ మిలిందా సంస్థకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో ఆయన సంపద 107 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.
* ఇక ఆర్నాల్డ్‌ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్‌ డాలర్లు సంపాదించారు. ఈ జాబితాలో పేర్కొన్న టాప్‌ 500 మంది ధనికుల్లో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఆర్నాల్ట్‌ తొలిస్థానంలో నిలిచారు.
* అమెజాన్ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌తో విడాకులు తీసుకుని భరణం పొందిన మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా తీసుకుంటే ఈమె 22వ స్థానంలో ఉన్నారు.
* ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫ్రాంకోయిస్‌ నిలిచారు.
* రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారత్‌లో అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ వ్యాప్తంగా 13 వస్థానంలో నిలిచారు.
* అంబానీ తర్వాత స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ 20.5 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
* హెచ్‌సీఎల్‌ టెక్‌ శివ నాడార్‌ 92 స్థానంలో, కొటాక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కొటాక్‌ 96స్థానంలో నిలిచారు.
* బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రపంచంలోని అత్యంత ధనవంతుల  ర్యాంగ్  ఈ సూచిక మార్చి 2012 లో ప్రారంభమైంది.
* న్యూయార్క్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి ప్రతి రోజు సూచిక నవీకరించబడుతుంది


views: 753



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams