Current Affairs Telugu Daily

కుల్‌భూషణ్ మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం 
* అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌ భారీ విజయాన్ని సాధించింది.
* నౌకాదళ విశ్రాంత ఉద్యోగి కుల్‌భూషణ్‌కు పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్ష నిలిచిపోయింది.
* మరణ దండన విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలనీ, అప్పటివరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) పాకిస్థాన్‌కు విస్పష్టం చేసింది.
*  జాదవ్‌ వ్యవహారంలో పాక్‌ అనుసరించిన తీరును అడుగడుగునా ఆక్షేపించింది. న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పింది.
*  16 మంది సభ్యుల ధర్మాసనంలో, ఉపాధ్యక్షుడిగా ఉన్న చైనా ప్రతినిధి సహా మొత్తం 15 మంది భారత్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇవ్వడం జరిగింది.
* కుల్‌భూషణ్‌ అరెస్టు, విచారణ ఆసాంతం పాకిస్థాన్‌ అన్యాయంగా వ్యవహరించిందని, భారత రాయబారులు ఆయనను కలవకుండా పదేపదే నిలువరించిందని అంతర్జాతీయ న్యాయస్థానం తప్పు పట్టింది.
*  ‘‘పాక్‌ అదుపులో ఉన్న కుల్‌భూషణ్‌ను కలిసేందుకు, మాట్లాడేందుకు ఆ దేశం.. భారత రాయబారులకు అసలు అవకాశమే ఇవ్వలేదు. ఆయనకు న్యాయ సహాయం దక్కకుండా చేసింది. మార్చి 3, 2016న జాదవ్‌ను అరెస్టు చేసిన వెంటనే భారత్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పాకిస్థాన్‌కు ఉంది. కానీ ఆ పని చేయలేదు. మూడు వారాలపాటు విషయాన్ని దాచిపెట్టింది. విషయం తెలిసిన తర్వాత దౌత్యాధికారులను పంపేందుకు భారత్‌ పదేపదే ప్రయత్నించినా, అందుకు అనుమతించలేదు.
* ఆ దేశ విజ్ఞప్తులను పాక్‌ తోసిపుచ్చడం ముమ్మాటికి నిజం. తన విధులను నిర్వర్తించకుండా భారత్‌ ఎలా అడ్డుకోబోయిందో పాకిస్థాన్‌ వివరించలేకపోయింది’’ అని ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్‌ఖవి అహ్మద్‌ యూసుఫ్‌ తీర్పులో పేర్కొన్నారు.
*  ఈ కేసును మరోసారి లోతుగా సమీక్షించాలని, కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధింపుపై పునరాలోచించాలని పాకిస్థాన్‌ను గట్టిగా ఆదేశించారు.
*  జాదవ్‌కు న్యాయ సహాయం అందించే హక్కు భారత్‌కు ఉందని చెప్పారు. ‘‘ఇంకేమాత్రం జాప్యం లేకుండా జాదవ్‌కు ఆయన హక్కుల గురించి పాక్‌ తెలియజేయాలి.
*  వియన్నా ఒప్పందం ప్రకారం భారత కాన్సులర్‌ అధికారులను కలుసుకునే అవకాశాన్ని కల్పించాలి.’’ అని స్పష్టం చేశారు. 
* 49 ఏళ్ల కుల్‌భూషణ్‌ జాదవ్‌ తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారంటూ పాకిస్థాన్‌ సైనికులు 2016లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
*  విచారణ చేపట్టిన సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు మరణశిక్ష విధించింది.
* ఆయన గూఢచౌర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పేర్కొంది. అయితే ఈ వాదనలను భారత్‌ ఖండిస్తూ, అదే ఏడాది మే 8న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
* భూషణ్‌ అసలు పాకిస్థాన్‌ వెళ్లనే లేదని, ఉద్యోగ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అపహరణకు గురయ్యారని పేర్కొంది.
*  దీంతో మరణ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన న్యాయస్థానం- గత ఫిబ్రవరిలో ఏకబిగిన విచారణ చేపట్టింది. ఉభయ దేశాల వాదనలను పరిగణనలోకి తీసుకుంది. తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి... ఎట్టకేలకు  దానిని వెల్లడించారు. 
* అంతర్జాతీయ న్యాయస్థానం దీని ప్రధాన  కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలో యున్నది.

views: 667



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams